English   

యశ్ కుటుంబంలోకి కొత్త ప్రాణం.. వారసుడొచ్చాడు..

 Yash
2019-10-30 16:01:10

కేజియఫ్ సినిమా తర్వాత యశ్ కూడా అన్ని ఇండస్ట్రీలకు చేరువయ్యాడు. ఈయనకు అభిమానులు కూడా పెరిగిపోయారు. కేజియఫ్ 2తో బిజీగా ఉన్న ఈయనకు ఇప్పుడు మరో శుభవార్త వచ్చింది. ఈయన కుటుంబంలోకి మరో కొత్త ప్రాణం వచ్చింది. యశ్ భార్య రాధిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని ట్వీట్ చేసాడు ఈ హీరో. తమ కుటుంబంలోకి మరో కొత్త వారసుడు వచ్చాడని చెప్పాడు యశ్. అంతేకాదు.. ఫ్యామిలీ ఫోటోను కూడా ట్వీట్ చేసాడు ఈయన. యశ్ కు తనయుడు పుట్టిన విషయాన్ని తెలుసుకుని ఆనందంతో తేలిపోతున్నారు అభిమానులు. ఆయనకు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ వెల్లువ మొదలైంది. అందరికీ ఓపిగ్గా కూర్చుని యశ్ కూడా రిప్లై ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈయన కేజియఫ్ 2తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగాన్ని మరింత భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. వచ్చే ఏఢాది విడుదల కానుంది కేజియఫ్ 2.

More Related Stories