English   

మంచు మనోజ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో మరి..

 Manchu Manoj
2019-10-30 18:16:14

మొన్నటికి మొన్న భార్య ప్రణతి రెడ్డి విషయంలో కోలుకోలేని షాక్ ఇచ్చాడు మంచు మనోజ్. విడిపోతున్నామంటూ సడన్ గా ఓ లేఖ విడుదల చేసాడు. మూడేళ్లు కూడా కలిసుండగకుండానే విడిపోయారు మనోజ్ దంపతులు. అందుకే పర్సనల్ గొడవలతో సినిమాలు కూడా చేయలేదు ఈ హీరో. అయితే ఇప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారం వెతుక్కున్నాడు ఈ హీరో. దాంతో దీపావళి సందర్భంగా మరోకొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు తానేం చేసినా కూడా ఆశీర్వదిస్తూ వచ్చిన అభిమానులు ఇప్పుడు తాను చేయబోయే ఈ పనిని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నట్లు చెప్పాడు,. 'ఎంఎం ఆర్ట్స్' పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించినట్లు మనోజ్ ట్వీట్ చేసాడు. అయితే ఇందులో కేవలం తాను హీరోగా నటించబోయే సినిమాలు మాత్రమే నిర్మిస్తాడా లేదంటే అందరి సినిమాలు చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మంచు వారింట మూడు బ్యానర్స్ ఉన్నాయి. లక్ష్మీ ప్రసన్న అలాగే ఉండగా.. విష్ణు 24 ఫ్రేమ్స్ పెట్టాడు. ఇప్పుడు మనోజ్ ఎంఎం ఆర్ట్స్ అంటున్నాడు. కొత్త టాలెంట్స్‌ను బయటికి తీసుకొచ్చి గొప్ప సినిమాలు అందించడానికి తనవంతు కృషి చేస్తానంటున్నాడు మనోజ్. మరి ఈయన నిర్మాణంలో చేయబోయే తొలి సినిమా ఎవరితో ఉండబోతుందో చూడాలిక. 

More Related Stories