English   

జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇస్తున్న సెన్సేషనల్ యాంకర్..

anchor
2019-10-31 05:39:52

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోను మించింది మరోటి లేదు. దానికి వచ్చిన రేటింగ్ మరేదానికి రాదు.. రాలేదు కూడా. ఇప్పటికీ ఇదే కంటిన్యూ అవుతుంది. ఇక ఈ షోలో చేయడానికి చాలా మంది నటులు ఆసక్తి చూపిస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త ఆర్టిస్టులను కూడా తెలుగు సినిమాకు పరిచయం చేస్తున్న షో జబర్దస్త్. ఇక ఇప్పుడు మరో యాంకర్ కూడా ఈ షోలోకి వస్తుంది. ఆమె మరెవరో కాదు.. మంగ్లీ. వీ6 ఛానల్‌లో తీన్మార్ వార్తలతో ప్రేక్షకులకు పరిచయమైన మంగ్లీ... ఇప్పుడు తెలంగాణలోనే మోస్ట్ పాపులర్ యాంకర్ అయిపోయింది. ఈమె పాటలకు కూడా చాలా రెస్పాన్స్ వస్తుంది.

తాజాగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న బన్నీ రాములో రాములా పాట పాడింది కూడా ఈమె. ఇక ప్రతీ ఏటా బతుకమ్మ పాటతో రచ్చ చేస్తుంటుంది మంగ్లీ. ఈమె ఇప్పుడు జబర్దస్త్ స్క్రీన్ పై కనిపించబోతుంది. ఇప్పటికే యాంకర్స్ అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ గ్లామర్ ఈ షోకు శ్రీరామరక్షగా మారిపోయాయి. ఇప్పుడు మంగ్లీ కూడా ఓ స్కిట్ లో కనిపించింది. ఫసక్ శశి టీంలో ఈమె కనిపించబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలైంది. ఇది చూసి ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇదే షోలో గతంలో కూడా చాలా మంది సెలెబ్రిటీస్ వచ్చి సందడి చేసారు. మరిప్పుడు మంగ్లీ ఏం చేస్తుందో చూడాలిక.

More Related Stories