English   

టాలీవుడ్ లో మరో విషాదం...సీనియర్ నటి మృతి

Geetanjali.jpg
2019-10-31 08:01:41

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. తాజాగా కమెడియన్ వేణు మాధవ్ తెలుగు ప్రేక్షకులకి దూరం కాగా ఈరోజు ఉదయం టాలీవుడ్ సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూన్న ఆమె తుదిశ్వాస విడిచారు. కాకినాడలో జన్మించిన ఈమె తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించారు. ఆమె వయసు ప్రస్తుతం 62 సంవత్సరాలు. 1961లో తొలిసారిగా ఎన్టీఆర్ నటించిన సీతారామ కల్యాణం చిత్రం ద్వారా సీత పాత్రలో వెండితెరకు పరిచమైన గీతాంజలి కలవారి కోడలు, డా. చక్రవర్తి, బొబ్బిలియుద్ధం, దేవత, గూఢచారి116, శ్రీ శ్రీ మర్యాదరామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. ఆమె అసలు పేరు మణి. ఆమె పార్థీవదేహాన్ని నందినగర్‌లోని నివాసానికి తరలించారు. నటుడు రామకృష్ణను వివాహం చేసుకున్నారు.  

More Related Stories