ఖైదీకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్

దీపావళికి పెద్దగా రచ్చ చేయకుండా రిలీజయ్యి బ్లాక్బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న సొంతం చేసుకుంది ఖైదీ. విజయ్ బిగిల్ భారీ ప్రమోషన్స్ట్తో మంచి టాక్ వచ్చినా ఈ సినిమాకి అంత కన్నా పాజిటివ్ పబ్లిక్టాక్ రావడంతో సినిమా ఎక్కడా తగ్గకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అసలు ఎవరూ ఊహించని విధంగా ఒక ఖైదీ పోలీసులను రక్షించే కథతో ఈ సినిమాని తెరకెక్కించి హీరోయిన్, ఐటెం సాంగ్, పాటలు, లవ్ సీన్లు లేకపోయినా మంచి టాక్ సంపాదించింది.
అందరూ ఊహించినట్టుగానే ఈ సినిమాకి కొనసాగింపు ఉంటుందని ప్రకటించింది సినిమా యూనిట్. డిల్లీ (సినిమాలో కార్తి పాత్ర పేరు) మళ్లీ మీ ముందుకు వస్తాడు. ‘ఖైదీ- 2’ను తెరకెక్కిస్తామని’ ఆ సినిమా దర్శకుడు లోకేష్ పేర్కొన్నారు. ఇక ఖైదీకి సీక్వెల్ ఉంటుందని, తప్పకుండా త్వరలోనే ఆ సినిమా మొదలవుతుంది కార్తీ చెప్పాడు. ‘ఖైదీ’ ఓ రాత్రి జరిగిన కథ కాగా ‘ఖైదీ 2’ మాత్రం అసలు ఢిల్లీ ఎందుకు జైలుకు వెళ్లాడు? జైలులో ఏం జరిగింది? అనే విషయాన్ని పార్ట్ 2లో చూపిస్తారు. ఓ రకంగా ఇది సీక్వెల్ కాదు ప్రీక్వెల్. ఇక ఈ దర్శకుడు ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న 64వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అది పూర్తికాగానే ‘ఖైదీ- 2’ చిత్రం ప్రారంభం కానుంది.