English   

కొరటాల శివతో రామ్ చరణ్.. అంతా కలలాగే ఉందిగా.. 

 Ram Charan
2019-10-31 11:54:42

మిర్చి సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్-కొర‌టాల సినిమా ఓపెన్ అయింది. బండ్ల‌గ‌ణేష్ నిర్మాత‌గా ఈ చిత్రానికి కొబ్బ‌రికాయ్ కూడా కొట్టారు. కానీ ఏదో జ‌రిగింది సీన్ లోప‌ల‌. ఆ స్క్రీన్ ప్లేలో లాక్ ఏంటో అర్థం కాలేదు కానీ క‌థ‌లో ఎక్క‌డో తేడా కొట్టి ఈ సినిమా ప‌ట్టాలెక్క‌క ముందే అట‌కెక్కేసింది. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ సినిమా గురించి ఇటు చ‌ర‌ణ్ కానీ.. అటు కొర‌టాల కానీ నోరు విప్ప‌లేదు. ఆ త‌ర్వాత కొర‌టాల శ్రీ‌మంతుడు చేసి ఇండ‌స్ట్రీ హిట్ తో త‌న స‌త్తా చూపించాడు. జ‌న‌తా గ్యారేజ్ తో హ్యాట్రిక్ పూర్తి చేసాడు. ఆ తర్వాత భ‌ర‌త్ అనే నేను సినిమాతో మరో విజయం కూడా అందుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా బిజీగా ఉన్నాడు కొరటాల శివ. ఈ చిత్రం నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఇప్పుడు మరో వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి తర్వాత రామ్ చ‌ర‌ణ్ తో సినిమా ఉంటుంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విష‌యాన్ని చ‌ర‌ణ్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు. కొణిదెల, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాయ‌ని అప్పట్లో తెలిపాడు చ‌రణ్. ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చి కూడా మ‌ళ్లీ చాలా రోజులు అయిపోయింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రంపై మ‌ళ్లీ ఎవ‌రూ మాట్లాడ్డం లేదు. ఈ విష‌యాన్ని ఇటు చ‌ర‌ణ్.. అటు కొర‌టాల ఇద్ద‌రూ మ‌రిచిపోయారు. ఇప్పుడు రామ్ చర‌ణ్ మ‌రో రెండేళ్ల వ‌ర‌కు బిజీ. కొర‌టాల కూడా ఇత‌ర సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. చరణ్ ప్రస్తుతం రాజ‌మౌళితో బిజీ. ఇలా మ‌రో ఏడాదిన్న‌ర వ‌ర‌కు చ‌ర‌ణ్ అస్స‌లు దొర‌క‌డు. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు కొర‌టాల అయితే ఈయ‌న కోసం వేచి చూడ‌డుగా..! అంటే రెండోసారి కూడా ఈ కాంబినేష‌న్ బిస్కెట్ అవుతుంద‌నేగా దీన‌ర్థం.

More Related Stories