English   

పీకే రీ ఎంట్రీ  రెమ్యునరేషన్ తెలుసా..

 Pawan Kalyan
2019-10-31 13:27:24

పవన్ కల్యాణ్ సినిమా అంటేనే రికార్డులకు కేరాఫ్ అడ్రస్. ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఓపెనింగ్స్ విషయంలో మాత్రం అద్భుతాలు చేస్తాడు. రెండేళ్ల కింద వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తొలిరోజే 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది. ఆ సినిమా కానీ హిట్ అయ్యుంటే ఈ రోజు నాన్ బాహుబలి మొత్తం పవన్ పేరు మీదే ఉండేదంటున్నారు విశ్లేషకులు. ఫ్లాప్ సినిమాలతోనే అంతగా మ్యాజిక్ చేసాడు పవర్ స్టార్. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడనే వార్తలు వస్తున్నాయి. 'సత్యాగ్రహి' టైటిల్ తో ఈ సినిమా చేస్తాడని తెలుస్తుంది. బంగారం సినిమా తీసిన తర్వాత 2006 ప్రాంతంలో సత్యాగ్రహి టైటిల్ తో సినిమా చేయాలనుకున్నాడు పవన్. ముహూర్తం కూడా పెట్టాడు. కానీ అనుకోని కారణాలతో సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఇదే టైటిల్ తో క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాతగా సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రం కోసం ఏకంగా 50 కోట్ల పారితోషికం తీసుకుంటాడని ప్రచారం జరుగుతుంది. పవన్ ఇంత మొత్తం చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ రీ ఎంట్రీ సినిమా అంటే కచ్చితంగా బిజినెస్ 150 కోట్ల వరకు జరుగుతుంది. అందుకే అందులో మూడో వంతు తన పారితోషికంగా తీసుకోబోతున్నాడు పవర్ స్టార్. ఒకవేళ అన్నీ కుదిరితే ఈ చిత్రం నవంబర్ 15న మొదలు కానుంది. 

More Related Stories