ఇలియానా కంటే కేసీఆర్ అందగాడు.. ఆర్జీవి సంచలనం..

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడెలా మాట్లాడతాడో.. ఎలా ఆలోచిస్తాడో చెప్పడం కష్టం. కనీసం ఊహించాలనుకున్నా కూడా పిచ్చెక్కడం ఖాయం. ఎందుకంటే ఆయన ఆలోచనలు అలా ఉంటాయి మరి. ఇప్పుడు కూడా ఈయన ఇలియానా, కేసీఆర్ ను పోలుస్తూ చేసిన కొన్ని కమెంట్స్ సంచలనాలు రేపుతున్నాయి. తనకు ఇలియానా కంటే కేసీఆర్ అందంగా కనిపిస్తాడని చెబుతున్నాడు ఈయన. తెలంగాణ ముఖ్యమంత్రిపై వర్మ చేసిన కామెంట్స్ పై మండిపడుతున్నారు అభిమానులు. ఎవర్ని పడితే వాళ్లను ఎలా పడితే అలా మాట్లాడేస్తావా అంటూ రెచ్చిపోతున్నారు తెలంగాణ తమ్ముళ్లు. అయితే ఈయన ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. తనకు కేసీఆర్ గంటసేపు మాట్లాడినా వింటూ ఉంటానని.. కానీ ఇలియానాను అంతసేపు చూడలేం కదా అంటున్నాడు. అందుకే తన దృష్టిలో ఇలియానా కంటే కేసీఆర్ అందగాడని.. ఆయన ఎంతసేపు మాట్లాడినా కూడా అలా చూస్తుండిపోతానంటున్నాడు. అన్నట్లు అక్టోబర్ 31న ఇలియానా బర్త్ డే.. ఆమె పుట్టినరోజు నాడే చిత్రమైన కమెంట్స్ చేసాడు వర్మ. మరి వీటిపై కేసీఆర్, ఇల్లీ బేబీ ఎలా స్పందిస్తారో చూడాలిక.