English   

విజయశాంతిని మహేష్ బాబు ఏమని పిలుస్తాడో తెలుసా..

 Vijayashanti
2019-10-31 16:19:41

దాదాపు 12 ఏళ్ళ తర్వాత మళ్లీ సినిమాల వైపు వస్తుంది విజయశాంతి. ఈమె నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ వేగంగా జరుగుతుంది. అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పింది ఈమె. ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది లేడీ సూపర్ స్టార్. తనను మహేష్ ఏమని పిలుస్తాడనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది విజయశాంతి. తనను మహేష్ బాబు అమ్మా అని పిలుస్తాడని చెప్పుకొచ్చింది. ఒక్కోసారి మేడమ్ అని కూడా సంభోదిస్తాడని.. తాను అలా పిలిచినపుడు సంతోషంగా ఉంటుందని చెప్పింది విజయశాంతి. మరోవైపు తాను కూడా మహేష్ బాబును బాబు అని.. లేదంటే మీరు అని సంబోధిస్తానని చెప్పింది ఈమె. దాదాపు 30 ఏళ్ళ కింద విజయశాంతికి కొడుకుగా నటించాడు మహేష్ బాబు. కొడుకు దిద్దిన కాపురంలో ఆమెకు తనయుడిగా నటించాడు మహేష్. అదే బంధం ఇప్పటికీ కొనసాగుతుందని చెబుతుంది విజయశాంతి. ఏమైనా ఈ సినిమా చేయడం చాల ఆనందంగా ఉంది అని విజయశాంతి చెప్పుకొచ్చారు. జనవరి 12న విడుదల కానుంది సరిలేరు నీకెవ్వరు. 

More Related Stories