నిన్నే పెళ్లాడతా అంటున్న రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు..

ఇండస్ట్రీలోకి ఒక్కరు వచ్చేదే ఆలస్యం.. తర్వాత ఆ ఫ్యామిలీ మొత్తాన్ని లాగేయొచ్చు. సక్సెస్ అయితే వాళ్ల అదృష్టం లేకపోతే ఏం చేయలేం. తమ వంతు ప్రయత్నంగా ముందు వాళ్లను ఇండస్ట్రీకి తీసుకొస్తుంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబం నుంచి మరొకరు ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యూటీ సూపర్ స్టార్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఆమె తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ హీరోగా వస్తున్నాడు. అప్పట్లో తెలుగులోనే తమ్ముడు సినిమా చేస్తున్నట్లు చెప్పింది రకుల్. కానీ నిన్నే పెళ్లాడతా అనే సినిమాతో రకుల్ తమ్ముడు వస్తున్నాడు.
ముందు షార్ట్ ఫిల్మ్ తో వస్తాడనుకున్నాడు కానీ దానికంటే ముందు సినిమాతోనే వస్తున్నాడు అమన్. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. రాక్ ఎన్ రోల్ అనే షార్ట్ ఫిల్మ్‌లో అమన్ హీరోగా నటించాడు. సెక్స్.. గన్స్.. కొంతమంది ఇడియట్స్ నేపథ్యంలో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. ఇక ఇప్పుడు నిన్నే పెళ్లాడతా అంటూ డిసెంబర్ లో తన సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. ఇది పోస్ట్ చేసి.. ఆల్ ద బెస్ట్ మై లిటిల్ బ్రదర్. ఇది బిగినింగ్ మాత్రమే. నువ్వు ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ అక్క ప్రేమ చూపించింది రకుల్.