English   

బాబోయ్ జాన్వీ కపూర్ ఏంటి ఇలా మారిపోయింది..

jhan
2019-11-01 06:58:43

ఇండ‌స్ట్రీలో ఉండాలంటే టాలెంట్ కంటే ముఖ్యంగా అందాల ఆర‌బోతే ఉండాలా..? బాలీవుడ్ హీరోయిన్ల‌కు అభిన‌యం కంటే అందాల ఆర‌బోతే ముఖ్య‌మా..? ఏమో దీనికి అవును అనే స‌మాధాన‌మే వ‌స్తుంది ఆలోచిస్తే. ఎందుకంటే అక్క‌డ అందాలు ఆర‌బోయ‌ని ముద్దుగుమ్మ ఒక్క‌రు కూడా లేరు. విద్యా బాల‌న్ లాంటి వాళ్లు కూడా చివ‌రికి హాట్ షోతో మ‌తులు చెడ‌గొట్టేసారు. ఇప్పుడు జాన్వీ క‌పూర్ కూడా ఇదే చేస్తుంది. ధ‌డ‌క్‌లో న‌ట‌న‌తో మెప్పించిన ఈ భామ‌.. ఇప్పుడు వ‌ర‌స‌గా హాట్ ఫోటోషూట్లు చేస్తూనే ఉంది. ఎందుకు ఇంత‌గా రెచ్చిపోతుందో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు ఎలా ద‌క్కించుకోవాలో శ్రీ‌దేవి కూతుళ్ల‌కు తెలియ‌దా..? అందుకే ధ‌డ‌క్ విడుద‌ల త‌ర్వాత ఎక్కువ‌గా బ‌య‌టే క‌నిపిస్తుంది జాన్వీ. ముఖ్యంగా జిమ్ ఫోటోషూట్స్ బాగా హైలైట్ అవుతున్నాయి.

అక్కడికి వెళ్లిన ప్రతీసారి కూడా అదరహో అనిపించేలా అందాలను ఆరబోస్తుంది జాన్వీ కపూర్. బ‌య‌ట క‌నిపించిన ప్ర‌తీసారి తాను త‌ప్ప మరొక‌రు హైలైట్ కాకుండా చూసుకుంటుంది. అంత‌టితో ఆగ‌కుండా హాట్ ఫోటోషూట్లు కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు కూడా ఈమె ఓ హాట్ డ్రస్ లో బయటికి వచ్చింది. వైట్ స్నీకర్స్, బ్లాక్ స్లింగ్ బ్యాగ్‌తో పాటు బాడీ కలర్ పెన్సిల్ డ్రెస్ వేసుకొచ్చింది. తక్కువ మేకప్‌ వేసుకుని కూడా రావడంతో చూడగానే జాన్వీ బెదిరించేలా మారిపోయింది. అసలు ఈ అమ్మడును చూసి అంతా షాక్ అయిపోయారు. అసలు జాన్వీ ఏంటి ఇలా మారిపోయిందనుకున్నారు. ఇక ఈ గెటప్ లో అమ్మడును చూసి హాలీవుడ్ నటి కిమ్ కర్డషియాన్‌తో పోల్చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ 'తఖ్త్', 'గుంజన్ సక్సేనా - ది కార్గిల్ గర్ల్' సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. కచ్చితంగా ఇవన్నీ విడుదలైన తర్వాత జాన్వీ రేంజ్ మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Related Stories