English   

నానికి షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..

nani
2019-11-01 07:53:42

టాలీవుడ్ లో ప్రస్తుతం సెకండ్ గ్రేడ్ హీరోల లిస్టులో నాని, విజయ్‌ దేవరకొండ మధ్య పోటీ ఓ రేంజ్ లో నడుస్తుంది. ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో దూసుకుపోతున్నారు. మార్కెట్ పరంగా నాని కంటే విజయ్ ఎక్కువున్నాడు కానీ ఇమేజ్ పరంగా చూసుకుంటే మాత్రం నాని పైచేయి సాధించాడు. ఈయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నాని కోసం రాసిన కథలోకి విజయ్ దేవరకొండ వస్తున్నాడని తెలుస్తుంది. నాని నటించిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతోనే విజయ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాలతో స్టార్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఈయన నిర్మాత కూడా అయ్యాడు. మరోవైపు నాని కూడా నిర్మాతగా మారి వరస సినిమాలు నిర్మిస్తున్నాడు.

ఈ మధ్యే విశ్వక్ సేన్ హీరోగా హిట్ అనే సినిమాను అనౌన్స్ చేసాడు నాని. మరోవైపు విజయ్ కూడా మీకు మాత్రమే చెప్తా అంటూ వస్తున్నాడు. ఇక హీరోగా కూడా నానితో పోటీ పడుతున్నాడు విజయ్. నిన్నుకోరి, మజిలీ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన దర్శకుడు శివ నిర్వాణ ఈ మధ్యే నానిని కలిసి కథ చెప్పాడని.. దానికి ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఇప్పుడు ఇదే కథను విజయ్ ఓకే చేసాడని తెలుస్తుంది. పూరితో చేసే ఫైటర్ సినిమా తర్వాత శివ నిర్వాణ సినిమా వుంటుందని ప్రకటించాడు విజయ్‌ దేవరకొండ. మొత్తానికి ఇప్పుడు ఇండస్ట్రీలో నానికి పక్కా పోటీగా మారిపోయాడు విజయ్ దేవరకొండ.

More Related Stories