English   

అట్లీ షారుక్ సినిమా టైటిల్ ఫిక్స్...రేపు ఓపెనింగ్

Shah Rukh Khan
2019-11-01 09:08:16

రాజారాణి వంటి ఎమోషనల్ లవ్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్న దర్శకుడు అట్లీ. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తేరి, మెర్సల్ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా మారాడు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ బిగిల్ ఈ దీపావళికి విడుదల అయ్యి సంచలన విజయం అందుకుంది. అయితే అట్లీ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరిగింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్నట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా ట్వీట్ చేశారు. 

ఈ సినిమాకి సంకి అనే టైటిల్ ని కూడా ఖరారు చేసినట్లు తెలిపారు. నవంబర్ 2న ఈ సినిమాను ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒకరకంగా షారుక్ ఖాన్ ఫాంలో లేడు. ఆయన నటించిన చిత్రాలు ఘోరంగా పరాజయం పాలయ్యాయి. షారుక్ నటించిన చివరి సినిమా ‘జీరో’  కూడా షారుక్ ని గట్టెక్కించలేకపోయింది. అప్పుడెప్పుడో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ అందుకున్న షారుక్ ఇప్పటి వరకూ సక్సెస్ ముఖం చూడలేదు. దీంతో కింగ్ ఖాన్ మళ్ళీ సౌత్ వంక చూస్ అట్లీని సెలెక్ట్ చేసుకున్నాడు. మరి అట్లీ అయినా షారుక్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి. 

More Related Stories