English   

మీకు మాత్రమే చెప్తా రివ్యూ 

Meeku Matrame Chepta
2019-11-01 12:33:18

తెలుగు ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేసిన ప్రయత్నం 'మీకు మాత్రమే చెప్తా'. పెళ్లిచూపులు సినిమాతో తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రం చేసాడు ఈయన. మరి మీకు మాత్రమే చెప్తా ఎలా ఉందో చూద్దాం..

కథ:

రాకేష్ (తరుణ్ భాస్కర్) ఓ ఛానెల్ యాంకర్. అతడికి ఓ ఫ్రెండ్ (అభినవ్) ఉంటాడు. రాకేష్‌కు తను ప్రేమించిన అమ్మాయి స్టెఫీ (వాణి భోజన్)తోనే పెళ్లి సెట్ అవుతుంది. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనుకోకుండా రాకేష్ ఫోన్ కు ఓ వీడియో వస్తుంది. అందులో పర్సనల్ వీడియో ఒకటి ఉంటుంది. అది కానీ బయటికి వస్తే రాకేష్ జీవితం నాశనం అయిపోతుంది.. అప్పుడు ఏం జరుగుతుంది.. తన పెళ్లి ఆగిపోకుండా.. ఆ వీడియో బయటికి రాకుండా తన స్నేహితుడితో కలిసి ఆ వీడియోను ఎలా డిలీట్ చేసారు.. అసలేంటి ఆ వీడియో అనేది అసలు కథ..

కథనం:

చిన్న అబద్ధం చెప్పడం.. దాన్ని కప్పి పుచ్చడానికి మరో అబద్ధం.. దాని కోసం మరో అబద్ధం ఇలాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి. గతంలో కామెడీ జోనర్ లోనే వచ్చాయి ఈ చిత్రం. కాస్త కొత్తగా.. ఫ్రెష్ గా ఇప్పుడు ఇలాంటి కథతోనే వచ్చాడు కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్. ఈ కథలో తరుణ్ భాస్కర్ ను హీరోగా తీసుకోవడంతో నిజంగానే షమ్మీర్ విజయం సాధించాడు. సింపుల్ కథను స్క్రీన్ ప్లేతో మాయ చేసే ప్రయత్నం చేసాడు ఈ దర్శకుడు. ముఖ్యంగా ఈ సినిమాను తాను అనుకున్నది అనుకున్నట్టుగా తెరపై చూపించడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ లోనే కథ అంతా బయట పెట్టేసాడు దర్శకుడు. అక్కడే చుట్టేసినట్లు సినిమా స్లోగా అనిపిస్తున్నా కూడా కామెడీ సీన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఫ్రెష్ ఫేసులు కావడంతో కూడా సినిమా కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చాలా సన్నివేశాలను అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. కానీ కథ చాలా చిన్నది కావడంతో అక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు బాగానే లాక్కొచ్చినా కూడా ఆ తర్వాత దర్శకుడి మైండ్ ఖాళీ అయిపోయిందేమో అనిపిస్తుంది. కథ లేక అక్కడక్కడే తిరుగుతుంది. స్క్రీన్ ప్లే కూడా అప్పటి వరకు ఉన్నంత ఇంట్రస్టింగ్ గా అనిపించలేదు. తరుణ్ భాస్కర్, అతని ఫ్రెండ్స్ తో వచ్చే కామెడీ బాగానే వర్కవుట్ అయినా కూడా కథ లేకపోతే ఎంత కామెడీ చేసినా కూడా అంతేనా అనిపిస్తుంది. మీకు మాత్రమే చెప్తాలో ఇదే అనిపించింది. అనసూయ పాత్ర కూడా తేలిపోవడంతో కథ ముందుకు కదల్లేదు. పర్సనల్ వీడియో అనేది ముందు నుంచి చెబుతూనే తన హీరో చెడ్డవాడు కాదు అనేది కూడా ప్రమోట్ చేసుకున్నాడు దర్శకుడు. పరిస్థితుల ప్రభావంతోనే అలా చేసాడు అనేది స్పష్టం చేసాడు.. దాంతో హీరో కారెక్టర్ పై సింపతి వర్కవుట్ అవుతుంది. క్లైమాక్స్ వరకు అదే సింపతీ కొనసాగించి.. చివర్లో మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఓవరాల్ గా అక్కడక్కడా నవ్వుకోడానికి పర్లేదనిపించేలా ఉంది కథ..

నటీనటులు:

ఈ సినిమా చూసిన తర్వాత తరుణ్‌ భాస్కర్ ను దర్శకుడు అంటే ఎవరూ నమ్మరు.. ఎందుకంటే పర్ఫెక్ట్ యాక్టర్ అయిపోయాడు ఈ చిత్రంతో. ముఖ్యంగా ఈయన నటన సూపర్బ్. కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయింది. ఎక్కడా తడబాటు లేకుండా కుమ్మేసాడు. హీరోయిన్ వాణి భోజన్‌ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అనసూయ కూడా పర్లేదు. అభినవ్ గోముఖం పాత్ర అయితే అదిరిపోయింది. కామెడీ టైమింగ్ కూడా కేక. మిగిలిన వాళ్లు చాలా వరకు కొత్త వాళ్లే.

టెక్నికల్ టీం:

సంగీత దర్శకుడు శివకుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఇచ్చాడు. ఇక ఎడిటింగ్ పర్లేదు. సెకండాఫ్ అక్కడక్కడా కాస్త ల్యాగ్ అయినట్లు అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. తనకున్న కథను చాలా చక్కగా నిర్మించాడు విజయ్. ఇక దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ చిన్న పాయింట్ తీసుకుని ఎంటర్ టైనింగ్ గా తీసే ప్రయత్నం చేసాడు. చాలా వరకు ఇది సక్సెస్ అయింది కూడా.

చివరగా: మీకు మాత్రమే చెప్తా.. కొన్నిచోట్ల చెప్పి నవ్వించారు..

రేటింగ్: 2.5 /5.

More Related Stories