సినిమా టిక్కెట్లు అమ్మిన విజయ్ దేవరకొండ

2019-11-01 12:49:05
టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ సరికొత్తగా ఉంటాయి. పెళ్లి చూపులు చిత్రంతో విజయ్ కు సినీ లైఫ్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను మీకు మాత్రమే చెప్తా సినిమాలో హీరోగా పరిచయం చేశాడు. కామెడీ మూవీ అయిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఐమాక్స్ కౌంటర్లో కూర్చొని సినిమా టికెట్లు అమ్మాడు. టిక్కెట్ కౌంటర్లో విజయ్ను చూసిన అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించారు. అనసూయ, అభినవ్ గోమతం కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా ప్రమోషన్స్ ని అలా ముందుకు తీసుకు వెళ్తున్నాడు విజయ్. ప్రస్తుతం ఆయన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా పూరీజగన్నాథ్ దర్శకత్వం వహించనున్న ఫైటర్ సినిమాలో నటించనున్నారు.