English   

యాక్షన్ తెలుగు ట్రైలర్...యాక్షన్ తగ్గట్టుగానే !

puri
2019-11-02 06:22:40

విశాల్ హీరోగా మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్ గా చేస్తున్న యాక్షన్ సినిమా తెలుగు ట్రైలర్ ఈరోజు సాయంత్రం రిలీజ్ చేశారు.  సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ ను పూరీ జగన్నాధ్ రిలీజ్ చేశారు. ఇక సినిమా పేరుకు తగ్గట్టే యాక్షన్ ఎపిసోడ్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టున్నారు. విజువల్స్ అయితే కళ్ళు చెదిరేలా ఉన్నాయి. ఈ చిత్రంలో విశాల్ ఆర్మీ కల్నల్ సుభాష్ గా నటిస్తున్నాడు. ఇంటర్నేషనల్ క్రైం నేపథ్యంలో తెరక్కుతోన్న ఈ సినిమాలో విశాల్ తో పాటు తమన్నా కూడా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో మెరిసింది. 

కార్ ఛేజింగ్ లు, బైక్ ఛేజింగ్ సీన్స్ ని దర్శకుడు ఉత్కంఠ భరితంగా చిత్రీకరించినట్లు ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చినట్టయ్యింది. తమన్నా పవర్ ఫుల్ గా కనిపిస్తూనే గ్లామర్ ను కూడా  ఒలకబోసింది. తమన్నాతో పాటు ఐశ్వర్య లక్ష్మి, ఆకాంక్ష పూరి కీలక పాత్రల్లో నటించారు. హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాని నిర్మిస్తున్నారు.  

 

More Related Stories