English   

నాకు బోల్డ్ కథలు వద్దు బాబోయ్ అంటున్న పాయల్ రాజ్ పుత్..

payal
2019-11-02 06:34:12

ఎవరైనా ఒకటి రెండు సినిమాలు ఒకే జోనర్ లో చేస్తే వాళ్లను అదే తాటికి కట్టేస్తారు మన ప్రేక్షకులు. దర్శకనిర్మాతలు కూడా వాళ్లు అదే అని ఫిక్స్ అయిపోతారు. వరుసగా రెండు ఫ్యామిలీ సినిమాలు చేస్తే ఆ హీరోయిన్ పై అదే ముద్ర పడిపోతుంది. అదే రెండు బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేసింది అంటే ఆమెపై అలాంటి ముద్ర పడిపోతుంది. తాజాగా పాయల్ రాజ్ పుత్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ఈ భామ ఎక్స్పోజింగ్ ను నమ్ముకుంది. తొలి రెండు సినిమాలు rx100, rdx లవ్  లో అలాంటి పాత్రలు చేయడంతో ఆమెపై ఆ ముద్ర పడిపోయింది. దాంతో దర్శక నిర్మాతలు కూడా పాయల్ రాజ్ పుత్ అంటే అలాంటి సినిమాలు చేస్తుంది అంటూ ఒక అంచనాలకు వచ్చేశారు.

రెమ్యూనరేషన్ బాగా ఇస్తే కచ్చితంగా అలాంటి కథలకు పాయల్ రాజ్ పుత్ ఓకే చెబుతుందని ప్రచారం ఇండస్ట్రీలో బాగా ఎక్కువైపోయింది. ఇలాంటి సమయంలో తాను నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నానని.. అందుకే ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు తనకు అవసరం లేదని చెబుతోంది. ఈ మధ్య ఒక దర్శకుడు వచ్చి ఇది మీకు మాత్రమే సరిపోయే కథని చెప్పాడని తెలుస్తోంది. తీరా హీరోయిన్ చెప్పమని అడిగితే కథ మొదలు పెట్టిన అరగంటలోనే అరడజను బెడ్రూం సీన్లు చెప్పాడని ప్రచారం జరుగుతుంది. దాంతో పూర్తిగా వినకుండానే సినిమాకు నో చెప్పేసింది పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం ఈమె రవితేజ హీరోగా నటిస్తున్న డిస్కో రాజా లో హీరోయిన్ గా కనిపిస్తుంది. ఈ సినిమాతో తాను కోరుకున్న గుర్తింపు వస్తుందని ఆశ పడుతుంది పాయల్ రాజ్ పుత్.

More Related Stories