English   

పవర్ స్టార్ సరసన లేడీ సూపర్ స్టార్

pk
2019-11-02 06:53:16

అజ్ఞాతవాసి సినిమా రిలీజయిన తరువాత రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడి పోవడంతో ఇక పూర్తి స్థాయిలో సినిమాలు మానేస్తున్నాఅని ప్రకటించారు. అయితే అయితే తాజాగా పవర్ స్టార్ మళ్ళీ వెండి తెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు ఈ మధ్య హల్ చల్ చేస్తున్నాయి. సైరా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూర్చాయి. ఇక పవన్ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ పవన్ కి ఖుషీలాంటి హిట్ ఇచ్చిన ఎఎం రత్నం నిర్మిస్తారని సమాచారం. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయన తార నటించనుందని అంటున్నారు.  

సైరాలో చిరు సరసన  అదరగొట్టిన నయనతార ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కోసం రెడీ అవుతున్నట్లు టాక్. ఇప్పటికే క్రిష్ కృష్ణం వందే జగద్గురం సినిమా చేయడమతో నయనతారతో ఉన్న పరిచయంతో పవన్ కళ్యాణ్ కోసం ఆమెని సంప్రదించినట్లుగా చెబుతున్నారు. పవన్ సినిమాకి నయనతార ఓకే చెబుతుందో లేదంటే పవర్ స్టార్ కోసం మరో హీరోయిన్ కోసం క్రిష్ ప్రయత్నం చెయ్యాలో అనేది అధికారిక ప్రకటన వెలువడితే కానీ తెలియదు. 

More Related Stories