English   

కొరటాల శివ చిరు సినిమా లైన్ అదేనా

Chiranjeevi
2019-11-02 07:56:09

చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. మిగతా భాషల్లో అంతగా ఆడలేదు. తెలుగులో సైరా సక్సెస్ తర్వాత కొరటాల శివతో సినిమా మొదలు పెట్టేశారు మెగాస్టార్. దసరా నాడు పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలో తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమాను కొరటాల శివ డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్‌తో తెరకెక్కించబోతున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. కొనేళ్ల క్రితం సింహాచలం అప్పన్న గుడి భూములను కొందరు భూస్వాములు కాజేశారట. 

అయితే వాటిని ఒక వ్యక్తి పోరాడి మళ్ళీ ఆ భూములను దేవాలయానికి అప్పగించారట. అలా అక్రమంగా ప్రవర్తించిన వారిపై తిరగబడే పాత్రలో చిరంజీవి నటిస్తున్నాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. వాస్తవంగా జరిగిన ఈ సంఘటనను ఆధారం చేసుకుని కొరటాల శివ కథ రాసుకున్నాడని అంటున్నారు. ఇందులో చిరంజీవి దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు చెబుతున్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారినపై హీరో ఎలా ఉక్కుపాదం మోపాడు. దేవాలయ ఆస్తులను కాపాడడానికి హీరో ఏం చేశాడు. అనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

More Related Stories