English   

మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్..

Renu desai
2019-11-02 08:01:37

ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పర్సనల్ లైఫ్ ను కూడా బాగానే ఎంజాయ్ చేస్తోంది రేణుదేశాయ్. పవన్ కళ్యాణ్ తో పదేళ్ల కాపురం తర్వాత విడిపోయిన ఈమె ప్రస్తుతం పూణేలో ఉంటుంది. ఆమెతో పాటే పిల్లలు అఖిరా నందన్, ఆద్య కూడా ఉంటున్నారు. అయితే ఈ దీపావళి సంబరాల కోసం పిల్లలు హైదరాబాద్ రావడంతో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. అక్కడే హాయిగా హాలిడే ఎంజాయ్ చేస్తుంది రేణు దేశాయ్. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ తో దీపావళి సంబరాలు చేసుకున్నారు పిల్లలిద్దరు. దాంతో పూణేలో ఒంటరిగా మిగిలిపోయింది రేణు దేశాయ్. అందుకే తన పర్సనల్ ట్రిప్ ప్లాన్ చేసుకుంది ఈమె. మాల్దీవ్స్ లో ప్రస్తుతం రేణు దేశాయ్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. త్వరలోనే తెలుగు ఇండస్ట్రీలో నటిగా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ తో నటించిన బద్రి, జానీ సినిమాల తర్వాత సినిమాలో కనిపించలేదు. మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చినా కూడా పవన్ తో పెళ్లి కారణంగా ఆమెను దూరంగా ఉండిపోయింది. అప్పటినుంచి సాంకేతిక విభాగంలో పని చేస్తోంది రేణు దేశాయ్. ఇప్పటికే మరాఠీలో దర్శకురాలిగా ఇష్క్ వాలా లవ్ చేసింది. తెలుగులో కూడా రైతుల నేపథ్యంలో ఒక సినిమా చేయాలని ఆలోచిస్తుంది రేణు దేశాయ్. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో హీరో అక్క పాత్రలో నటిస్తోంది. మొత్తానికి అటు పర్సనల్.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను పక్కగా బ్యాలెన్స్ చేస్తుంది రేణు దేశాయ్.

More Related Stories