English   

సేవ్ రంగస్థలం అంటూ క్యాంపెయిన్...అందుకే

Rangasthalam
2019-11-02 08:11:13

రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిన చిత్రం రంగ‌స్థలం. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియాడిక‌ల్ మూవీలో స‌మంత క‌థానాయిక‌గా న‌టించింది. 80ల నేపధ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా క్రిటిక్స్ ప్రశంస‌లు పొంద‌డ‌మే కాక చరణ్ లోని నటుడిని బయట పెట్టి బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇక ఈ సినిమాని త‌మిళంలో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇప్పటికే రంగ‌స్థ‌లం త‌మిళ రీమేక్ రైట్స్ లారెన్స్ ద‌క్కించుకోగా, చిత్రంలో ఆయ‌న రామ్ చ‌ర‌ణ్ రోల్ పోషించ‌నున్నాడ‌నే ప్రచారం మొదలయ్యింది. ఇక తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. త్వర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నున్నార‌ని అంటున్నారు. ఒకవేళ లింగుస్వామి చేయకుంటే బాలా రంగస్థలం రీమేక్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్. అయితే లారెన్స్ సినిమాలు బాగా మాస్ గా ఉంటాయి. దాని మీద బాల చేయిపడితే ఇంకా దారుణంగా తయారవుతుందని ఈ సినిమాని మరీ నాటుగా మార్చేస్తారని చరణ్ అభిమానులు కంగారుపడుతున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో ఏకంగా రంగస్దలాన్ని పాడు చేయద్దని, సేవ్ రంగస్దలం అన్నట్లుగా పోస్ట్ లు పెడుతున్నారు. మరో పక్క లారెన్స్ బాలీవుడ్ లో కాంచన రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. లక్ష్మి బాంబ్ టైటిల్ తో రూపొందుతున్న ఆ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు.  

More Related Stories