English   

వినాయక్‌ కి విలన్ గా కుర్ర హీరో 

 Naveen Chandra
2019-11-02 08:40:34

డైరెక్టర్ వి.వి.వినాయక్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై, శరభ ఫేమ్ ఎన్. నరసింహ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా సీనయ్య (కంప్లీట్ ఎమోషన్). అక్టోబర్ 9న వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ చేసిన మూవీ టీమ్ అదే రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది. ఇక ఇది 1982-84 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ అని క్లారిటీవచ్చేసింది. ఇక మెకానిక్ గా పనిచేసుకునే సీనయ్య తన కూతురిని చంపిన వారిపై ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనే లైన్ పై ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. ఈ లైన్ తో చాలా సినిమాలు వచ్చాయి గతంలో, కానీ స్టోరీ రొటీన్ అయినప్పటికీ రివెంజ్ డ్రామా డిఫరెంట్ ఉంటుందని రియాలిటీ ఎమోషన్ సినిమా స్థాయిని పెంచుతుందని అంటున్నారు. మణిశర్మ సంగీతం అందించనున్న ఈ సినిమాలో వినాయక్ కి విలన్ గా నవీన్ చంద్ర నటించనున్నాడని అంటున్నారు. 

More Related Stories