ఖైదీకి మహేష్ విషెస్

కొత్త దనాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ గ్రాండ్ గా స్వాగతిస్తారని తాజాగా చాటి చెప్పిన చిత్రం ఖైదీ. తాజాగా విడుదలైన తమిళ చిత్రం ఖైదీ సినిమాలో హీరోయిన్, సాంగ్స్ లాంటివి లేకుండానే తీశారు. అయితే కథ కట్టి పడేసేలా ఉండడం వలన ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. తమిళ సినిమా అయినా తెలుగు వారు కూడా బాగా ఆదరిస్తున్నారు. వారం దాటుతున్నా హౌస్ ఫుల్ షోలతో దూసుకు వెళుతోంది ఈ సినిమా. ఇక సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మద్య చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తున్న మహేష్ బాబు. తన ట్విట్టర్ ద్వారా ఖైదీ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇది కొత్త ఫిలిం మేకింగ్ కి నాంది అని యాక్షన్ సీక్వెన్స్ లుకానీ నటీనటుల నటన కానీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు. సాంగ్స్ లేకుండా మీరు చేసిన ప్రయత్నం అభినందనియం అని పేర్కొన్న మహేష్ యూనిట్ శుభాకాంక్షలు అని తెలిపారు. కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో కార్తీ యావజ్జీవ శిక్ష పడిన ఖైదీగా కనిపించారు. కూతురిని కలవడానికి వెళ్ళే క్రమంలో ఒకరోజు రాత్రి నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా హిట్ కావడంతో ఈ సినిమాకి ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తోంది యూనిట్.