English   

బాలీవుడ్ సినిమాలో మహేష్ బాబు.. షాక్‌లో ఫ్యాన్స్..

 Mahesh Babu
2019-11-02 17:18:14

బాలీవుడ్ సినిమాలో మహేష్ బాబు కనిపించాడు. నమ్మడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. మన సూపర్ స్టార్ నిజంగానే బాలీవుడ్ సినిమాలో కనిపించాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది అని అనుమానం రావచ్చు.. కానీ మహేష్ బాబుకి తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఆయనను అక్కడ కూడా అందరు గుర్తుపడతారు. సూపర్ స్టార్ సినిమాలు హిందీలో అనువాదం అవుతుంటాయి. అలా అక్కడి ప్రేక్షకులకు మహేష్ బాగానే తెలుసు. దానికి తోడు అందగాడు అనే మంచి పేరు కూడా ఉంది. ఇప్పుడు బాలీవుడ్లో తన హీరో కోసం ఈ పేరును వాడుకున్నాడు ఒక దర్శకుడు. సూరజ్ పంచోలి హీరోగా తెరకెక్కుతున్న శాటిలైట్ శంకర్ సినిమాలో మహేష్ బాబు పేరుతోపాటు ఫోటో కూడా కనిపించింది. అందులో హీరోయిన్గా మేఘ ఆకాష్ నటించింది. ఈ సినిమా నవంబర్ లోనే విడుదల కానుంది. తాజాగా ఒక పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఆ పాట మొదలు కాకముందే హీరోని చూస్తూ మేఘా ఆకాశ్ ఒక డైలాగ్ చెబుతుంది.. అదే ఇప్పుడు మహేష్ బాబు అభిమానులకు బాగా నచ్చేసింది. నువ్వు అచ్చం మహేష్ బాబు లాగా ఉంటావని మీ అమ్మ చెప్తూ ఉంటుందంటూ హీరోతో ఈ డైలాగ్ చెప్పగానే.. అతడు మహేష్ బాబు ఎవరు అంటాడు.. దాంతో పక్కనే మహేష్ బాబు ఫోటో చూపిస్తుంది హీరోయిన్. ఇదంతా చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. తమ హీరోకు బాలీవుడ్లో కూడా ఇంత ఇమేజ్ వుంది అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.

More Related Stories