English   

నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రాజుగారు.. వర్మకు రాజమౌళి పంచ్.. 

 Rajamouli
2019-11-02 19:05:22

ఢీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.. అందులో విష్ణు ప్రతీ విషయంలోనూ బ్రహ్మానందాన్ని ఇరికిస్తుంటే ఏమో నాకు తెలియదు.. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అనే డైలాగ్ ఉంది కదా ఇప్పుడు ఇదే రాజమౌళి వాడుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ చేసిన పనికి తాను ఈ డైలాగ్ వాడుకోవాల్సి వచ్చింది. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో కేఏ పాల్ మీద ఓ పాటని విడుదల చేశాడు వర్మ. ఈ పాట మొదట్లో జేమ్స్ బాండ్ తరహాలో ఎంట్రీ ఇచ్చి మిగతా అంతా పాల్ రాజకీయ ఫోటోలని చూపుతూ పాటని కట్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలుతున్నాయి. పైగా నవ్వు తెప్పించేలా ఈ పాట ఉంది కూడా. ఈ పాటను ట్వీట్ చేస్తూ మన దేశంలో జోకర్ సినిమా అంత పెద్ద విజయం సాధించినప్పుడు.. కేఏ పాల్ బయోపిక్ బాహుబలి 3 కంటే పెద్ద హిట్ అవుతుందంటూ ట్వీట్ చేసాడు. అంతటితో ఆగకుండా రాజమౌళి వాషింగ్టన్ లో కూడా పాల్ తో దీని గురించి చర్చించాడంట అంటూ ఆయన్ని కూడా ఇరికించేసాడు. ఇదే విషయం తనకు పాల్ ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి చెప్పారని అని ట్వీట్ చేసాడు. అందులో మళ్లీ రాజమౌళిని ట్యాగ్ చేశాడు.. దాంతో వెంటనే లైన్ లోకి వచ్చిన దర్శకధీరుడు దయచేసి ఇందులో నన్ను ఇన్వాల్వు చెయ్యొద్దు 'రాజు' గారు' అని ట్వీటేసాడు. అక్కడ రాజుగారు అంటూ కులాల గొడవల్లోకి తనను లాగొద్దని చెప్పాడు జక్కన్న. దానికి వెంటనే వర్మ కూడా సెటైర్ వేసాడు. అయ్యో లేదు సర్.. నాకు పాల్ ఫోన్ చేసి చెప్పాడు అంతే అంటూ రిప్లై ఇచ్చాడు. 

More Related Stories