English   

బిగ్ బాస్ విన్నర్‌పై నాగార్జున సంచలన ట్వీట్.. రూమర్స్ నమ్మొద్దు..

BigBoss 3 Winner.jpg
2019-11-03 11:21:34

చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ సీజన్ 3పై మళ్లీ ట్వీట్ చేసాడు నాగార్జున. తనకు ఈ జర్నీ అద్భుతంగా అనిపించిందని.. 100 రోజుల ప్రయాణానికి ఈ రోజు ముగింపు పలకబోతున్న కంటెస్టెంట్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు మన్మథుడు. అలాగే సోషల్ మీడియాలో కొన్ని గంటలుగా విన్నర్ పై వస్తున్న వార్తలపై కూడా స్పందించాడు నాగ్. ఫైనల్ లో రాహుల్ సిప్లిగంజ్ గెలిచేసాడని.. అతడి ఇంటి దగ్గర సంబరాలు కూడా చేసుకుంటున్నారంటూ ప్రచారం జరిగింది.. జరుగుతూనే ఉంది.

శ్రీముఖి కంటే రాహుల్ ఓట్ల విషయంలో ముందున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూసి శ్రీముఖి ఫ్యాన్స్ కూడా బాధ పడుతున్నారు. ఈ సమయంలో బిగ్ బాస్ 3 హోస్ట్ నాగార్జున సంచలన ట్వీట్ తో అన్ని రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేసాడు. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ఇంకా షూట్ చేయలేదని.. అది లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందని చెప్పి సంచలనం సృష్టించాడు. దాంతో ఒక్కసారిగా సీన్ అంతా తలకిందులు అయిపోయింది. నాగార్జున చెప్పడంతో అసలు విన్నర్ రాహుల్ అవునా కాదా అనే కొత్త అనుమానాలు మొదలయ్యాయిప్పుడు. ఇవన్నీ లీకులు ఇచ్చింది కేవలం ప్రేక్షకుల నాడిని తెలుసుకోడానికి అనే ప్రచారం కూడా జరుగుతుంది. నాగార్జున ట్వీట్ చేయడం వెనక కూడా ఇదే రహస్యం అంటున్నారు నిర్వాహకులు.

ఫైనల్ ఎపిసోడ్ ఇంకా షూట్ చేయలేదని.. అది లైవ్ జరుగుతుందని చెప్పాడు మన్మథుడు. చిరంజీవి చేతుల మీదుగా ఈ ఫైనల్ విజేత ట్రోఫీ అందుకోబోతున్నాడు. మొత్తానికి నాగార్జున ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది.

More Related Stories