English   

మహేష్ బాబు, అల్లు అర్జున్ కాంప్రమైజ్ అయ్యారా..

mb
2019-11-04 05:25:43

ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంది. ఒకేసారి అందులోనూ ఒకేరోజు ఇద్దరు స్టార్ హీరోలు వస్తే కచ్చితంగా ఇద్దరూ నష్టపోతారు. పైగా మన తెలుగు ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఖాయంగా ఉంటాయి. బలంగా కూడా ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతికి కూడా ఇదే సెంటిమెంట్ పని చేస్తుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ తమ సినిమాలను జనవరి 12న విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసకువడం వెనక ఓ బలమైన కారణం ఉంది. జనవరి 10న విడుదల చేస్తే సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక నమ్మకం, సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలంగా పడిపోయాయి. రెండేళ్ల కింద విడుదలైన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి.. 5 ఏళ్ల కిందట విడుదలైన మహేష్ బాబు నేనొక్కడినే సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దాంతో జనవరి 10 అంటే భయపడుతున్నారు మన దర్శక నిర్మాతలు. కానీ స్టార్ హీరోల సినిమాలకు ఇంత చిన్న సెంటిమెంట్లు పెట్టుకోవడం మంచిది కాదు అంటున్నారు విశ్లేషకులు.

జనవరి 10న విడుదల చేస్తే శుక్రవారం అవుతుంది.. సినిమా ఎలా ఉన్నా తొలిరోజు కలెక్షన్ల కుంభవృష్టి కురిపించడం ఖాయం. ఆ తర్వాత శనివారం కూడా ఫుల్స్ పడతాయి. అక్కడ నుంచి సంక్రాంతి సీజన్ మొదలవుతుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా జనవరి 12న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు మహేష్ బాబు, అల్లు అర్జున్. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య మాటలు నడిచాయని.. దిల్ రాజు, అల్లు అరవింద్ కూర్చుని మాట్లాడుకుని రెండు రోజుల గ్యాప్ లో వస్తున్నట్లు తెలుస్తుంది. జనవరి 11 అల వైకుంఠపురములో.. 13న సరిలేరు నీకెవ్వరు విడుదల కాబోతున్నాని తెలుస్తుంది. ఇదే జరిగితే ఇద్దరు హీరోలకు మంచిదే.. సంక్రాంతి సీజన్ కాబట్టి సినిమాలు బాగుంటే కచ్చితంగా రెండూ కమర్షియల్ విజయాలు అందుకుంటాయి. ఇక ఇదే పండక్కి కళ్యాణ్ రామ్ కూడా ఎంత మంచివాడవురా అంటూ వస్తున్నాడు. ఈయన సినిమా జనవరి 15న విడుదల కానుంది.

More Related Stories