English   

ఆ సంచలన దర్శకుడితో సినిమాకు సిద్ధమైన నాగ చైతన్య..

nag
2019-11-04 05:33:13

వరస సినిమాలతో రచ్చ చేస్తున్నాడు నాగ చైతన్య. ఈయన ప్రస్తుతం శేఖర్ కమ్ముల సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత మరో మూడు సినిమాలు కూడా లైన్ లో పెట్టాడు చైతూ. ఈ క్రమంలోనే ఈయనకు అజయ్ భూపతి చెప్పిన కథ బాగా నచ్చేసిందని తెలుస్తుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు ఇప్పటి వరకు రెండో సినిమా అయితే మొదలు పెట్టలేదు. అయితే మహాసముద్రం పేరుతో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. రవితేజకు చెప్పడం.. ఆయన కూడా ఓకే అనడం అన్నీ జరిగిపోయాయి. ఆ మధ్య అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు కూడా. అయితే కొన్ని రోజుల కింద చీప్ స్టార్ అంటూ ఒక సంచల ట్వీట్ చేసాడు అజయ్. అది ఎవర్ని అన్నాడనేది మాత్రం సస్పెన్స్. కానీ రవితేజతో ఈయనకు వార్ జరిగిందని.. కథ విషయంలో జరిగిన వివాదం కారణంగానే ఈ సినిమాను రవితేజ బయటికి వచ్చేసాడు.

అందుకే ఆయన్ని ఉద్ధేశించి చీప్ స్టార్ అనే ట్వీట్ చేసాడని ప్రచారం జరుగుతుంది. అయితే మహాసముద్రం సినిమా నుంచి రవితేజ బయటికి రావడం నిజమే.. ఇంతకు మించి ఈ సినిమా గురించి తననేం అడగొద్దు అంటున్నాడు అజయ్. ప్రస్తుతం తాను వేరే హీరోను వెతికే పనిలో ఉన్నానని.. ఇందులో సిద్ధార్థ్ మరో హీరోగా నటించే అవకాశాలున్నాయని చెబుతున్నాడు అజయ్. అయితే మరో హీరో దొరక్కపోవడంతో ఈ సినిమాను ఆపేసాడు అజయ్. ప్రస్తుతం నాగ చైతన్యకు ఓ కథ చెప్పి ఒప్పించాడని తెలుస్తుంది. ఈ కథపైనే ప్రస్తుతం కూర్చున్నాడు అజయ్ భూపతి. శేఖర్ కమ్ముల సినిమా పూర్తి కాగానే అజయ్ సినిమాతో బిజీ కానున్నాడు చైతూ. జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

More Related Stories