English   

లీక్స్ నిజమే....రాహుల్ నే వరించిన టైటిల్

Big Boss Winner.jpg
2019-11-04 08:59:18

మూడు నెలల పాటు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను బుల్లితేరలకే కట్టి పడేసిన బిగ్ బాస్ మూడో సీజన్ టైటిల్ ను అనుకున్నట్టుగానే రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు. నిన్న జరిగిన ఫినాలేలో ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో రాహుల్ విజేతగా నిలిచినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఇక టైటిల్ విన్నర్ అనే పేరుతో రంగంలోకి దిగిన శ్రీ ముఖి మాత్రం రన్నరప్ గా నిలిచింది. శ్రీముఖి, రాహుల్ మధ్యలో నాగార్జున ఇద్దరి చేతులు పట్టుకోగానే, అందరిలోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఎంత ముందు రోజునే రాహుల్ విన్నర్ అని తెలిసిపోయినా ఎక్కడో శ్రీముఖినే విన్నర్ అనే డౌట్ అందరినీ టీవీలకి అతుక్కునేలా చేసింది.

ఇక ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 14 వారాల్లో (15వ వారంలో నామినేషన్స్ లేవు) 11 సార్లు నామినేషన్‌లోకి వెళ్లి.. ఈ సీజన్‌లో ఎక్కువ సార్లు నామినేట్ అయ్యి సేవ్ అయిన కంటెస్టెంట్‌ అయిన రాహుల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లను వెనక్కినెట్టి తొలి ఫినాలే కంటెస్టెంట్ కావడమే కాదు టైటిల్‌ని కూడా ఖాయం చేసుకున్నాడు. గేమ్ సరిగా ఆడకపోయినా విన్నర్ కాగలిగాడు. 

మైక్ చేతికి అందగానే విజేత రాహుల్ భావోద్వేగాలు ఆపుకోలేక హెచ్చుస్థాయిలో మాట్లాడాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కృతజ్ఞతలు అంటూ గట్టిగా అరిచేశాడు. ఇక, పునర్నవి టాస్క్ లో బాగా పెర్ఫామ్ చేయాలంటూ ఎంతో ప్రోత్సహించిందని, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కూడా తన విజయానికి దోహదపడ్డాయని తెలిపాడు. ఇక చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ క్యాష్ చెక్ బోర్డు అందుకున్నాడు.

More Related Stories