English   

దిల్ రాజు, మహేష్ మధ్య చిచ్చుపెట్టిన సరిలేరు నీకెవ్వరు..

Mahesh Babu Dil Raju.jpg
2019-11-04 09:31:17

సంక్రాంతి సినిమాల రచ్చ ఇప్పుడు చాలా పెద్ద గొడవకు దారి తీసేలా కనిపిస్తుంది. ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వస్తే చాలా వరకు నష్టపోతామని బయ్యర్లతో పాటు నిర్మాతలు కూడా భయపడుతూ చస్తున్నారు. కానీ పంతానికి పోయి అటు బన్నీ..ఇటు మహేష్ ఒకేరోజు తమ సినిమాలు తీసుకురావాలని చూస్తున్నారు. అయితే ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు మాత్రం చాలా కంగారు పడుతున్నారు.

ఏం జరిగినా కూడా కోట్లు నష్టపోయేది మాత్రం ఈయనే.. ఎందుకంటే సరిలేరు నీకెవ్వరుకు ఈయన ఓ నిర్మాత.. అలాగే బన్నీ అల వైకుంఠపురములో సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్.. దాంతో రెండు సినిమాలు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తే మాత్రం కచ్చితంగా దారుణంగా నష్టపోతాడు రాజు. అందుకే ఈ విషయంలో ఈయన ఇద్దరు హీరోలతో పాటు నిర్మాతలతో కూడా కూర్చుని సెటిల్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో ఇటీవల మహేష్ బాబుని కలిసిన దిల్ రాజు.. తమ సినిమాని జనవరి 10న రిలీజ్ చేద్దామని చెప్పినట్లు తెలుస్తుంది. లేదంటే తాను ఈ చిత్రం నుంచి నిర్మాతగా తప్పుకుంటానని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి మహేష్ బాబు కూడా పాజిటివ్ గానే స్పందించినట్లు ప్రచారం జరుగుతుంది.

కాకపోతే ఈ ప్రపోజల్ నిర్మాతల నుంచి కాదు బన్నీ నుంచి వస్తే ఒప్పుకుంటానని చెప్పినట్లు తెలుస్తుంది. మహేష్ ఓమెట్టు దిగినపుడు బన్నీ కూడా ఓ మెట్టు దిగి చర్చకు వస్తే బాగానే ఉంటుందంటున్నారు అభిమానులు. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..? 

More Related Stories