English   

రాహుల్ బిగ్ బాస్ విన్నర్ ఎలా అయ్యాడు..

Big Boss 3Winner.jpg
2019-11-04 10:18:17

శ్రీముఖి.. శ్రీముఖి అంటూ మొన్నటి వరకు కూడా బిగ్ బాస్ లో పేరు మార్మోగిపోయింది. కచ్చితంగా ఈమె విన్నర్ అవుతుందని ఊహించారు కూడా. కానీ ఎవరూ ఊహించని విధంగా రాహుల్ విన్నర్ అయిపోయాడు. ఈయన ఊరికే విజేతగా మారలేదు. వెనక ప్లాన్స్ తో పాటు కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మొదట్లో డమ్మీగా ఉన్న రాహుల్.. పునర్నవితో లవ్ ట్రాక్ మొదలు పెట్టిన తర్వాత ఫేమ్ అయ్యాడు.

అక్కడ్నుంచి అసలు ఆట షురూ అయింది. పునర్నవితో లవ్ గేమ్ ఆడుతూనే తన గేమ్ లో కూడా గేర్స్ మార్చేసాడు రాహుల్. తొలివారంలోనే హేమతో ఓ రేంజ్ లో గొడవ పెట్టుకున్నాడు ఈయన. ఆమె ఎలిమినేషన్ తర్వాత వచ్చిన తమన్నాతో కూడా ఇదే పద్దతి.. ఇక శ్రీముఖితో కూడా ఎప్పుడూ గొడవ పడుతూనే ఉన్నాడు రాహుల్. శ్రీముఖితో మనోడికి ఉన్న వైరం సోషల్ మీడియాలో వరంగా మారింది. అందుకే ఆయనకు వరసగా ఓట్లు గుద్దేసారు. 

 జగన్ ఫ్యాన్స్ కూడా రాహుల్ కు ఓటేసినట్లు తెలుస్తుంది. దాని వెనక కారణం ఉంది. ఎన్నికలకు ముందే జగన్ పై ఓ పాట పాడాడు రాహుల్. అది వైరల్ అయింది. దాంతో ఆయన అభిమానులు ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ కు ఓటేసారని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఫైనల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాహుల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దానికి తోడు పునర్నవి ఫ్యాన్స్ కూడా రాహుల్ కు ఓట్లేసారు. పున్ను ఎలిమినేషన్ తర్వాత అందరితో కలిసిపోవడం మొదలుపెట్టాడు రాహుల్. దాంతో పాటు ఇంట్లో ప్రతీ విషయంపై కూడా సీరియస్ అవ్వడం.. నిలదీయడం వంటివి మనోడి ఇమేజ్ పెంచేసాయి.

ముఖ్యంగా ఫేక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న తర్వాత ఇంకా స్టార్ అయిపోయాడు. అలా చివరికి శ్రీముఖిని ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయాడు రాహుల్. 

More Related Stories