English   

విడాకులకు సిద్ధమైన ఆ పెద్దంటి అమ్మాయి..

divorce
2019-11-04 16:37:57

టాలీవుడ్ లో ఆమె ఓ పెద్దింటి అమ్మాయి.. కొన్ని దశాబ్ధాల చరిత్ర వాళ్ల కుటుంబానికి ఉంది. వాళ్ల నాన్న కూడా ఒకప్పటి స్టార్ హీరో.. విలక్షణ నటుడు కూడా. తెలుగులో డైలాగులు చెప్పడంలో ప్రత్యేక శైలి కూడా. అలాంటి హీరోగారి కూతురు ఈ అమ్మడు. సినిమాలు చేస్తూ నకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకునే క్రమంలో ఉంది సదరు నటీమణి. అయితే ఈమె కాపురం మాత్రం ఊహించినంత అందంగా లేదని తెలుస్తుంది. అందుకే విడాకుల కోసం అప్లై చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ క్రమంలో కొన్ని స్టెప్స్ కూడా ముందుకు వేసినట్లు వార్తలొస్తున్నాయి.

దానికి కారణం కూడా ఏం లేదు.. భార్య పని చేస్తుండటం.. భర్త ఖాళీగా ఉండటమే అని తెలుస్తుంది. అందుకే పనికిరాని భర్తతో కలిసుండటం మంచిది కాదని ఆమె నిర్ణయించుకున్నట్లు సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. ఎప్పుడూ పరాయి దేశంలోనే ఉండే ఆయన గారు అప్పుడప్పుడూ ఇండియాకు వస్తుంటాడు.. వచ్చినపుడు కూడా భార్యతో పెద్దగా కలిసుండకపోవడంతో ఇహనో ఇప్పుడో ఆమె భర్త నుంచి విడాకులు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి దీనిపై ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అభిమానులు కూడా కంగారు పడుతున్నారు.

More Related Stories