English   

చిరు-తమన్నాలకి మాత్రమే తెలిసింది అదేనా

chiru
2019-11-04 16:52:26

మూడు నెలల నుండి సందడి చేసిన బిగ్ బాస్ షో ఇక అయిపోయింది. ఒక వైపు శ్రీముఖి ఇంకో వైపు రాహుల్, ఇద్దరూ ముందు నుండి విన్నర్స్ అనే ప్రచారం జరగడంతో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంట టీవీ ప్రేక్షకుల్లో కనిపించింది. దాదాపు అందరి ఇళ్ళలో ఈ షో ప్లే అయిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. బుల్లి తెరపై మరో సారి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి హీరో నాగార్జునతో కలిసి త‌న‌దైన శైలిలో చేసిన‌ సందడి అల‌రించింది. కంటెస్టెంట్లతో మాట్లాడుతూ తనదైన శైలిలో హాస్యం పండించారు. అయితే ట్రాన్స్ జెండర్ తమన్నాతో మాట్లాడుతూ మాత్రం ఎమోషనల్ అయ్యారు.

ఓ సమస్య వస్తే స్నేహాన్ని కూడా పక్కనబెట్టి నువ్వు ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తావో నాకు తెలుసు. ఓ సమస్యను నువ్వు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటావు అని చిరంజీవి అంటుండగానే తమన్నా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అసలు చిరు దేనిగురించి మాట్లాడుతున్నాడో అక్కడెవరికీ అర్థంకాలేదు. అయితే చిరంజీవి మళ్లీ అందుకుని, ఏం జరిగిందో నీకూ నాకూ మాత్రమే తెలుసు, ఐ అప్రిషియేట్ యూ అంటూ అభినందించే సరికి తమన్నా తీవ్ర భావోద్వేగాలకు లోనైంది. అయితే అది పవన్ ని శ్రీ రెడ్డి తిట్టినప్పుడు జరిగిన సంఘటన అయ్యుండచ్చనే వాదన వినిపిస్తోంది. అప్పటిదాకా శ్రీ రెడ్డిని సపోర్ట్ చేసిన తమన్నా పవన్ ని శ్రీ రెడ్డి తిట్టగానే ప్లేటు మార్చేసి ఆమె మీద రివర్స్ అయింది. బహుశా చిరు దాని గురించే ప్రస్తావించి ఉండచ్చని అనుకుంటున్నారు.

More Related Stories