English   

బిగ్ బాస్ షోలో అమ్మాయిలకు అర్హత లేదా..?

biggboss
2019-11-05 05:08:34

అదేంటి అలా అనేసారు అనుకుంటున్నారా..? ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఒకటి రెండు కాదు మూడు సీజన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అమ్మాయికి టైటిల్ రాలేదు. తొలి సీజన్ శివబాలాజీ ట్రోఫీ కొట్టేసాడు.. ఆ తర్వాత సీజన్ కౌశల్ ఏకపక్షంగా దున్నేసాడు.. ఇప్పుడు రాహుల్ టైటిల్ తీసుకున్నాడు. ఈ మూడు సార్లు కూడా అబ్బాయిలకే టైటిల్స్ వచ్చేసాయి. దాంతో బిగ్ బాస్ షోలో అమ్మాయిలు ఉన్నా కూడా కేవలం గ్లామర్ కోసమే అన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం కూడా లేకపోలేదేమో..? ఈ సారి ఇంట్లో ఉన్న వాళ్లంతా అందాల ఆరబోతలో ఆరితేరిపోయారు. ముఖ్యంగా శ్రీముఖి అయితే ఓ రేంజ్ లో గ్లామర్ షో చేసింది. ఆమె విన్నర్ అవుతుందని మొదట్నుంచి ప్రచారం జరుగుతూ వస్తున్నా కూడా చివర్లో ఊహించని విధంగా రాహుల్ సీన్ లోకి వచ్చాడు.

ఆమె అంటే పడని వాళ్లంతా గుంపగుత్తగా రాహుల్ సిప్లిగంజ్ కు ఓట్లేసి గెలిపించేసారు. అయితే ఇక్కడే అసలు తేడా కొడుతుంది. రాహుల్ కంటే శ్రీముఖి ఇమేజ్ చాలా ఎక్కువ కానీ బిగ్ బాస్ పరంగా చూసుకుంటే ఆమెను మించిపోయాడు రాహుల్. అందుకే బిగ్ బాస్ షో కేవలం మగవాళ్ల కోసమేనా అనే అనుమానాలు వెల్లడిస్తున్నారు నెటిజన్లు. మరి దీనికి వచ్చే సీజన్ అయినా సమాధానం చెబుతుందో లేదో..?

 

More Related Stories