English   

నాని-సమంతా క్రేజీ కాంబినేషన్

nani
2019-11-05 05:16:09

నాగ చైతన్యతో వివాహం జరిగిన తర్వాత అక్కినేని కోడలిగా, స్టార్ హీరోయిన్‌ గా ఓ వెలుగు వెలుగుతోంది సమంత. ఇది వరకే ఆమెకున్న క్రేజ్, ఫాలోయింగ్‌ కి తోడు అక్కినేని అభిమానుల సపోర్ట్ కూడా ఆమెకి దొరకడంతో సమంత జర్నీ సాఫీగా సాగుతోంది. కాగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే సమంత ఓహ్ బెబే తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. అప్పటికే ఒప్పుకున్న 96 రీమేక్లో నటించి ఇక సినిమాలు ఆపెస్తుందని ప్రచారం జరిగింది. లేదు వెబ్ సిరీస్ చేస్తుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాలు అన్నిటికీ సమాధానం లభించింది. అదేంటంటే సమంతా కొత్త సినిమా అనౌన్స్ చేశారు. నానీతో నిన్నుకోరి సమంతతో మజిలీ సినిమాని డైరెక్ట్ చేసిన శివ నిర్వాణ ఈసారి ఆ ఇద్దరినీ కలిపి సినిమా తీస్తున్నాడు. నిన్న ఈ సినిమాని ప్రకటించారు. 

షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మిస్తున్న మూడో సినిమా ఇదే. మొదట నిన్ను కోరి, ఆ తర్వాత మజిలీ నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు ఈ కొత్త సినిమా ప్రకటించారు. నాని కెరీర్ లో 26వ సినిమా కాగా ఈ పోస్టర్ రివీల్ చేసి ప్రాజెక్టును అధికారికంగా ఫైనల్ చేశారు. నాని,  సమంత, శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో వి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శివ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సమంత ’96’ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. అతి త్వరలో ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.

More Related Stories