English   

కేరళకి మహేష్ టీమ్...గ్యాప్ తీసుకుంటారా

mb
2019-11-05 05:24:08

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తోన్న స‌రిలేరు నీకెవ్వ‌రు షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు..రష్మిక మందన జంటగా నటిస్తున్న ఈ సినిమా చాలా భాగం చిత్రీ క‌ర‌ణ పూర్త‌యింది. రిలీజ్ కు ఇంకా నెల‌లు సమయం మాత్ర‌మే ఉండడంతో షూటింగ్ ను ఇంకా స్పీడ‌ప్ చేశారు. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ను జరిపారు. ఈ షూట్ లో ప్రధాన పాత్రలతో  కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను కేరళలో ప్లాన్ చేసినట్టుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు.

ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరినట్టు ప్రొడక్షన్ కంపనీ ప్రకటించింది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు, ఒకటి రెండు పాటలను కూడా అక్కడ చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయట. సీనియర్ నటి  విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాను, జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.  ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ మూవీ కొత్త షెడ్యూల్ కేరళలో.  ఈ మూవీ తర్వాత ఓ 3 నెలలు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాడని అంటున్నారు. తన నెక్ట్స్ సినిమాను ఇంకా ఎనౌన్స్ చేయకపోవడంతో ఆయన గ్యాప్ కన్ఫాం అని అంటున్నారు.

More Related Stories