అసురన్ రీమేక్.... ఆ దర్శకుడి చేతికి....

తమిళ హీరో ధనుష్ తాజాగా నటించిన మూవీ అసురన్. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ దసరా సందర్భంగా రిలీజయి తమిళనాట భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తెలుగునాట వెంకటేష్ హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్స్ – కలైపులి థాను సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే తాజాగా ‘రాజుగారి గది 3’ సినిమాకి దర్శకత్వం వహించి హిట్ కొట్టిన ఓంకార్ కి ‘అసురన్’ తెలుగు రీమేక్ సినిమాని డైరెక్ట్ చేసే బాధ్యత అప్పగిస్తున్నట్టు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.
తెలుగులో కొన్ని షోలని డిజైన్ చేసి వాటి ద్వారా యాంకర్ గా మారిన ఓంకార్… ‘జీనియస్’(2012) చిత్రంతో దర్శకుడయ్యాడు. ఆ సినిమా తర్వాత భారీ విరామం తీసుకున్న ఓంకార్ దాదాపు మూడేళ్ళ గ్యాప్ అనంతరం ‘రాజు గారి గది’తో పలకరించాడు. హారర్ కామెడీ ఫిల్మ్‌గా రూపొందిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ హిట్ తో ‘రాజు గారి గది’ సిరీస్‌లో ‘రాజు గారి గది 2’, ‘రాజు గారి గది 3’ తెరకెక్కించి దర్శకుడిగా మంచి మార్కులు వేసుకున్నాడు ఓంకార్. అలా ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడని అంటున్నారు. త్వరలోనే ఓంకార్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.