రవితేజ కోసం మళ్లీ వచ్చేస్తున్నాడుగా.. ఇక దరువే..

రవితేజ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. వరస సినిమాలకు కమిట్ అవుతూ మస్త్ బిజీ అయిపోయాడు మాస్ రాజా. ప్రస్తుతం ఈయన డిస్కో రాజా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నాడు. ఈయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా ఈ మధ్యే అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం తమిళనాట బ్లాక్ బస్టర్ గా నిలిచిన తెరీ సినిమాకు రీమేక్ అని తెలుస్తుంది. దీనికి కనకదుర్గ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ తెరకెక్కించాడు. అక్కడ సూపర్ హిట్ అని తెరీని తెలుగులో పోలీసోడు అంటూ తీసుకొచ్చారు. అయితే అంత విజయం సాధించలేదు.. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రవితేజతో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎస్.ఎస్.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రవితేజతో థమన్ కు మంచి అనుబంధం ఉంది. ఈ కాంబినేషన్ లో కిక్ నుంచి మొదలై చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ హీరో చిత్రానికి పాటలు ట్యూన్ చేయబోతున్నాడు థమన్. పైగా మనోడు మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు ఇప్పుడు. కొన్నేళ్లుగా దూరంగా ఉన్న ఈ కాంబినేషన్ ను ఇప్పుడు గోపీచంద్ మలినేని కలిపాడు