English   

సాయి పల్లవిని చంపనున్న రానా 

Rana Daggubati
2019-11-05 14:03:51

తెలుగు సినిమాకి శాడ్ ఎండింగ్ పెట్టాలంటే భయపడే వారు ఒకప్పటి నిర్మాతలు. హీరోయిన్ మరణాన్ని అయిన ఒప్పుకున్తారేమో కానీ హీరో మరణాన్ని యాక్సెప్ట్ చేసేవారు కాదు. స్టార్‌ హీరోలతో ఈ తరహా ప్రయత్నం చేయడమంటే గగనమే కానీ కొంతకాలంగా తెలుగులలో జరుగుతున్న ప్రయోగాల వలన స్టార్ హీరోలు కూడా ఇమేజ్‌ చట్రాలలో ఇరుక్కోకుండా యాంటీ క్లైమాక్స్‌ సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే నాని ‘జెర్సీ’ నుంచి మొదలు ఇటీవల వచ్చిన చిరంజీవి ‘సైరా’ వరకు అన్ని విషాదాంత ముగింపుతో వచ్చినా ప్రేక్షకులను అలరించాయి. 

ఇప్పుడు ఇదే బాటలో రానా సినిమాకి యాంటీ క్లైమాక్స్‌ ఫైనల్ చేశారట. ఆయన నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమాని యాంటీ క్లైమాక్స్‌తోనే ముగించబోతున్నారట. నీది నాది ఒకే కధ దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న ఈ సినిమ శరవేగంగా షూట్ జరుపుకుంటోంది. ఈ సిన్మియాలో ఓ జర్నలిస్టుగా నటిస్తుండగా ఆయనకు జోడీగా కనిపించనున్న సాయిపల్లవి మాజీ మహిళా నక్సలైట్‌ పాత్రను పోషిస్తోందట. అయితే ముందుగ ఆమెను ప్రేమించే రానా క్లైమాక్స్‌కు వచ్చే సరికి ఆమెను చంపి తను సూసైడ్ చేసుకుంటాడట. రానా ఎందుకు అలా తన ప్రేయసిని చంపేశాడు వంటివి తెలియాలంటే ‘విరాటపర్వం’ సినిమా రిలీజ్ కావాల్సిందే. 

More Related Stories