English   

విజిల్ కలెక్షన్స్.. తెలుగులో తొలిసారి ఆ మార్క్ దాటిన విజయ్.. 

 Whistle
2019-11-05 14:29:16

త‌మిళ‌నాట ర‌జినీకాంత్ త‌ర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తోన్న హీరో విజ‌య్. ఈయ‌న సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌స్తే క‌లెక్ష‌న్లు ఎలా ఉంటాయో ఊహించుకోవ‌డం కూడా క‌ష్ట‌మే. ఇప్పుడు బిగిల్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈ చిత్రం తొలిరోజే తమిళ సినిమా రికార్డుల్ని బ‌ద్ధ‌లు కొట్టేసింది. తొలిరోజే ఏకంగా 50 కోట్ల గ్రాస్.. 33 కోట్లకు పైగా షేర్ వ‌సూలు చేసింది బిగిల్. తెలుగులో కూడా విజిల్ మంచి వసూళ్లు సాధిస్తుంది. ఇక్కడ తొలి రోజే ఏకంగా 2.60 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత కూడా అదే రోజు చూపించాడు విజయ్. ఇప్పటికే 10 రోజుల్లో విజిల్ తెలుగులో 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో తొలిసారి ఈ హీరో సినిమాకు 10 కోట్ల మార్క్ అందుకుంది. విజయ్ సినిమాలకు ఈ స్థాయి కలెక్షన్స్ రావడం నిజంగానే గొప్ప విషయం. సినిమాకు మంచి టాక్ ఉండటంతో రెండో వారం కూడా వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ఖైదీ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చినా కూడా స్లో కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా తమిళనాట ఇప్పటికే 60 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 129 కోట్లు షేర్ తీసుకొచ్చింది. స్పోర్ట్స్ మాఫియాపై జ‌రుగుతున్న కాన్ టెంప‌ర‌రీ క‌థ కావ‌డంతో బిగిల్ కు బాగా క‌నెక్ట్ అవుతున్నారు ప్రేక్ష‌కులు. ద్విపాత్రిభినయం కూడా క‌లిసొస్తుంది. మొత్తానికి బిగిల్ తో రికార్డుల దుమ్ము దులిపేస్తున్నాడు ఇళ‌య ద‌ళ‌ప‌తి.

More Related Stories