English   

విజయ్ దేవరకొండ సినిమాకు కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసా..

Meeku Mathrame Chepta
2019-11-05 14:55:20

విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి సినిమా చేసిన సినిమా మీకు మాత్రమే చెప్తా. ఒకప్పుడు పెళ్లిచూపులు మాదిరే చాలా తక్కువ అంచనాలతో వచ్చింది ఈ చిత్రం. తనే నిర్మాతగా మారి.. తనను హీరోగా నిలబెట్టిన తరుణ్ భాస్కర్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించాడు విజయ్ దేవరకొండ. తక్కువ బడ్జెట్.. కొత్త నటులు.. కొత్త దర్శకుడుతో వచ్చిన ఈ చిత్రానికి కలెక్షన్లు పర్లేదు అనిపించేలా వస్తున్నాయి. కంటెంట్ కాస్త వీక్ అనిపించినా కూడా విజయ్ బ్రాండ్ తో సినిమా బాగానే వర్కవుట్ అయింది. మీకు మాత్రమే చెప్తా సినిమాలో తరుణ్ భాస్కర్‌కు జోడిగా వాణి భోజన్ నటించింది. ఇక యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో కథ అంతా కేవలం నాలుగు పాత్రల చుట్టూనే సాగుతుంది. షార్ట్ ఫిల్మ్ మేకర్ షమ్మీర్ సుల్తాన్‌ను దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం చేసాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ చిత్రానికి మూడు రోజుల్లోనే 4.05 కోట్ల గ్రాస్ వచ్చిందని పోస్టర్లు విడుదల చేసాడు విజయ్ దేవరకొండ. తన సినిమా చీప్ గా ఉందని చేసిన విమర్శలకు కూడా తెరదించేస్తూ ఈ సినిమాను 5 కోట్లతో నిర్మించినట్లు చెప్పాడు విజయ్. ఇప్పటికే తన డబ్బులన్నీ వచ్చాయంటున్నాడు ఈయన. మొత్తానికి తన ఫస్ట్ వెంచర్ హిట్ అంటున్నాడు ఈ నిర్మాత. 

More Related Stories