English   

సినిమాల్లోకి వస్తారా.. మీడియాకు పంచ్ ఇచ్చిన పవన్..

pawan kalyan
2019-11-05 15:51:14

పవన్ కల్యాణ్ సినిమాల్లోకి వస్తున్నాడంటూ వార్తలు రావడంతో ఆయనపై మళ్లీ మీడియా ప్రశ్నించడం మొదలుపెట్టింది. దానికితోడు జగన్ పాలన బాగుంటే తాను వెళ్లి సినిమాలు చేసుకుంటాను అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు ఆ పార్టీ ఆయుధంగా వాడుకుంటుంది. ముఖ్యంగా జగన్ బాగా పరిపాలిస్తున్నాడు కాబట్టే కదా నువ్వు వెళ్లి సినిమాలు చేసుకుంటున్నావు అంటూ సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నాయకులు. దాంతో పవన్ ఇప్పుడు వాళ్లపై సెటైర్లు వేస్తున్నాడు.

ముఖ్యంగా మీడియా వాళ్లు కూడా ఇదే ప్రశ్న అడగడంతో దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పాడు. రాజకీయాలలో ఉన్నవాళ్లెవరూ వాళ్ల వాళ్ల వ్యాపారాలు చేసుకోవడం లేదా..? అవంతి శ్రీనివాస్ గారికి కాలేజీలు మూసేసి రాజకీయాల్లో ఉన్నారా.. జగన్ గారికి జగతి పబ్లికేషన్స్ భారతి సిమెంట్స్ వ్యాపారాలు లేవా.. అంటూ ప్రశ్నించాడు. తనకు వచ్చింది సినిమాల్లో నటన మాత్రమే అనీ అది తప్ప తనకు ఏవిషయం తెలియదు అంటూ కామెంట్ చేసాడు పవర్ స్టార్.

అంతేకాదు తాను సినిమాలలో నటిస్తానా లేదా అనేది పక్కనబెడితే సినిమాలతో మాత్రం ప్రయాణం చేస్తానని చెప్పాడు. నిర్మాణంలో సినిమాలు మాత్రం చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చాడు ఈయన. అంటే 'పింక్' రీమేక్ లో పవన్ నటిస్తాడా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదన్నమాట. ఏదేమైనా కూడా సినిమాలు చేస్తున్నారా అంటూ పవన్ ను మీడియా అడిగిన ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానాలు అయితే చెప్పాడు.

More Related Stories