English   

ఇది రాజకీయం.. నారా లోకేష్‌ను ఓదారుస్తున్న పవన్ కల్యాణ్.. 

Pawan Kalyan Nara lokesh
2019-11-05 17:25:32

నెగటివ్ పబ్లిసిటీ చేయడంలో భారతదేశ సినీ చరిత్రలో రామ్ గోపాల్ వర్మని మించిన వారు మరొకరు లేరు. ఆయన తన సినిమాను మొహం మీదే చూడొద్దు అని చెబుతాడు. తన సినిమాను ఆదరించకండి అంటాడు. ఇప్పుడు కూడా మరో జిమ్మిక్కు చేస్తున్నాడు వర్మ. ప్రస్తుతం ఈయన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తెరకెక్కిస్తున్నాడు. 

ఇందులోని మూడు పాటలు ఇప్పటికే సంచలనం సృష్టించాయి. ట్రైలర్ కూడా కాంట్రవర్సీలకు కేంద్రబిందువుగా నిలిచింది. బాబు చంపేస్తాడుతో పాటు కమ్మరాజ్యంలో కడప రెడ్లు, కేఏ పాల్ పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ ఫోటో ఒకటి విడుదల చేసాడు ఈయన. ఇందులో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ఓదారుస్తున్నట్లు ఉంది. పైగా రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అని పైన ట్యాగ్ లైన్ పెట్టాడు వర్మ. తన సినిమాకు రౌడీలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రజల సపోర్ట్ కావాలంటూ ట్వీట్ చేసాడు ఈయన. కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి సంచలనాలు, కాంట్రవర్సీలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు ఈ దర్శకుడు. నవంబర్ 29న సినిమా విడుదల కానుంది. 

ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్, నారా లోకేష్ ఇలా అందరి లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు కావాలని వివాదాలను కొని తెచ్చుకుంటున్నాడు వర్మ. మరోసారి ఇప్పుడు ఇదే చేస్తున్నాడు. మరి ఈ సారి ఎలాంటి సరికొత్త వివాదానికి రామ్ గోపాల్ వర్మ తెర తీస్తాడనేది చూడాలి.

More Related Stories