English   

అన్నీ అబద్ధాలే అని తేల్చేసిన మురుగదాస్.. 

AR Murugadoss
2019-11-05 18:42:33

పేరుకు తమిళ దర్శకుడు అయినా కూడా తెలుగులో కూడా మురుగదాస్ కు మంచి ఇమేజ్ ఉంది. ఈయన కోసం ఇక్కడ కూడా హీరోలు క్యూ కడుతుంటారు. కానీ తెలుగు ఇండస్ట్రీ మురుగదాస్ కు పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా 'దర్బార్‌' సినిమా తెరకెక్కిస్తున్నాడు ఏఆర్‌ మురుగదాస్‌. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు రజినీ. నయనతార హీరోయిన్.. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. 

ఇప్పటికే రజినీ తన పార్ట్ పూర్తి చేసుకుని హిమాలయాలకు కూడా వెళ్లొచ్చాడు. ఇదిలా ఉండగా ఈయన తర్వాతి సినిమాపై ఇప్పట్నుంచే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యే మురుగదాస్ తన లక్కీ హీరో సూర్యకు ఓ కథ చెప్పాడని.. ఆయన కూడా ఓకే చెప్పడంతో ఆ సినిమా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత మరో కథను తన తొలి సినిమా దినా హీరో అజిత్‌కు చెప్పగా.. ఆయన కూడా ఓకే చేసాడని వార్తలొచ్చాయి. దాంతో సూర్యను పక్కనబెట్టి అజిత్ సినిమా పట్టాలెక్కించడానికి మురుగదాస్ రెడీ అవుతున్నాడనే వార్తలొచ్చాయి. 

దీనిపై ఈ దర్శకుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను 'దర్బార్‌' పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నానని.. ఈ సినిమా తప్ప మరో దానిపై తనకు ఫోకస్ లేదని చెప్పాడు. తాను అజిత్‌ని కానీ.. సూర్యను కానీ కలవలేదని క్లారిటీ ఇచ్చాడు. తన నెక్ట్స్ సినిమాపై వస్తున్న వార్తలన్నీ అబద్ధాలే అని కొట్టి పారేసాడు ఈయన. 

More Related Stories