English   

శౌర్య కోసం దేవరకొండ హీరోయిన్

Ritu Varma.jpg
2019-11-06 08:54:49

నాగశౌర్య హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య అనే ఆమె దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్‌ మీదకు వెళ్లనుందని అప్పట్లో నిర్మాణ సంస్థ ప్రకటించింది. కానీ ఆ సినిమా ఇప్పటి దాకా అయితే ఇంకా మొదలు కాలేదు. అందుతున్న తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఏఎన్నాఆర్ క్లాసికల్ చిత్రాల్లో ఒకటైన 'మూగ మనసులు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాన్సెప్ట్ కూడా పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని అందుకే ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టారని అంటున్నారు. ఇక శౌర్య సరసన ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ నటించనున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 9వ తేదీన లాంచ్ కానున్నట్టు సమాచారం. ఆ వెంటనే షూటింగ్ మొదలు పెట్టి 2020 మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

More Related Stories