మహేష్ మేనల్లుడి సరసన నిధి

టీడీపీ ఎంపీ, మహేష్ బావ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. గతేడాది దిల్ రాజు ప్రొడక్షన్ లో 'అదే నువ్వు అదే నేను' అనే సినిమా దసరా రోజున లాంచ్ జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకి హాజరై క్లాప్ కొట్టారు. ఈ వేడుకకు సినీ రాజకీయాల ప్రముఖులు హాజరయ్యారు. అయితే కొంత షూటింగ్ అయ్యాక రషెస్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నే క్యాన్సిల్ చేశారు. ఆ సినిమానే దిల్ రాజు ఇప్పుడు రాజ్ తరుణ్ తో తీస్తున్నాడు.
లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు గల్లా అశోక్. ఇటీవల నాని, నాగార్జున హీరోగా దేవదాస్ సినిమాను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ హీరోగా సినిమా ఫైనల్ అయ్యింది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుందని అంటున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనుకుండా ఒప్పేసుకుని నాలుగు రాళ్ళు వెనకేసుకునే పనిలో పడ్డ నిధికి ఈ సినిమా అయిన హిట్ ఇస్తుందేమో చూడాలి.