English   

ఏడుగురు విలన్లతో కబ్జ చేస్తున్న ...ఉపేంద్ర

upendra
2019-11-06 19:06:54

విలక్షణ సినిమాలకి పెట్టింది పేరయిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర మరో డిఫరెంట్ సినిమాతో రెడీ అవుతున్నాడు. నిజానికి కన్నడలో ఉపేంద్ర సినిమాలంటే ఒక స్పెషల్ ట్రెండ్. తెలుగులో కూడా ఈ హీరోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన కబ్జ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలో నటిస్తున్నాడు. గ్యాంగ్ స్టర్స్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలుకానుందట. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఏడుగురు విల‌న్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.

ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన నానా పటేకర్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రకాశ్‌రాజ్‌, జ‌గ‌ప‌తి బాబు, జ‌య‌ప్రకాశ్ రెడ్డి , ప్రదీప్ రావ‌త్‌, స‌ముద్రఖ‌నిల‌ని విల‌న్స్‌గా ఎంపిక చేసుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక గ్యాంగ్‌స్టర్స్ కోసం బెంగళూరులో ఆడిష‌న్స్ నిర్వహించ‌గా, దానికి దాదాపు 10వేల మంది హాజ‌రయ్యార‌ట‌. ఇందులో 500 మందిని సినిమా కోసం ఎంపిక చేసిన‌ట్టు సమాచారం. ఈ నెల 15నుంచి సినిమా మొదటి షెడ్యూల్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనుందని అంటున్నారు.

More Related Stories