English   

దర్శకుడు తేజ నన్ను మోసం చేసాడు అంటున్న సీనియర్ హీరోయిన్ రాశి..

rasi
2019-11-07 05:13:11

అవును నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సంచలన విజయాలు అందుకుని స్టార్ అనిపించుకున్న సీనియర్ హీరోయిన్ రాశి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ లతో పాటు చిన్న చిన్న సినిమాలు కూడా చేస్తుంది. దానికి తోడు బిజినెస్ చేస్తూ బిజీగా ఉంది ఈ సీనియర్ ముద్దుగుమ్మ. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చింది రాశి. అక్కడ కొన్ని సంచలన విషయాలు బయట పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా దర్శకుడు తేజ గురించి కొన్ని నిజాలు బయట పెట్టింది ఈ హీరోయిన్. ఆయన తనను దారుణంగా మోసం చేసాడు అంటూ ఆలీతో సరదాగా కార్యక్రమంలో ప్రేక్షకులకు చెప్పింది. ఆయన దర్శకత్వంలో ఈమె నిజం సినిమాలో నటించింది. అందులో కథ చెప్పేటప్పుడు పూర్తిగా పాజిటివ్ గా చెప్పిన తేజ స్క్రీన్ పై మాత్రం పూర్తిగా నెగిటివ్ గా చూపించడంతో విమర్శలు గుప్పించింది.

ఆ సినిమాలో తనది హీరోయిన్ పాత్ర అని చెప్పి చివరికి విలన్ చేసాడు అంటూ ఫైర్ అయ్యింది రాశి. ఆ తర్వాత సినిమా చూసుకొని ఇదే విషయం అడిగానని.. కానీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పింది ఈమె. సినిమాలో గోపీచంద్, తనకు మధ్య లవ్ స్టోరీ ఉంటుంది అని చెప్పి మోసం చేశాడు అంటుంది ఈ సీనియర్ హీరోయిన్. కథ ఒకలా చెప్పి స్క్రీన్ పై మరోలా తీసినప్పుడు తనకు ఏమీ అర్థం కాలేదని కానీ సినిమా చూసిన తర్వాత అసలు విషయం బోధపడింది అని చెబుతోంది రాశి. అందుకే తన కెరీర్లో దర్శకుడు తేజ నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటుంది ఈమె.

More Related Stories