English   

రాహుల్ సిప్లిగంజ్ విజయం వెనక వైఎస్ జగన్ హస్తం..

biggboss
2019-11-07 05:23:36

వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. తను బిగ్ బాస్ విన్నర్ కావడం వెనక ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మాత్రం ఉన్నది జగన్మోహన్ రెడ్డి అని నిజం ఒప్పుకున్నాడు రాహుల్. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అసలు విషయం ఏంటంటే రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ కు రాకముందు కూడా ఫేమస్. ఆయన పాడిన పాటలు యూ ట్యూబ్ ను షేక్ చేసాయి. సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ పెట్టుకుని అందులో ప్రైవేట్ సాంగ్స్ పాడుకుంటూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ కుర్ర సింగర్. అయితే ఇందులో భాగంగానే ఎన్నికలకు ముందే జగన్ పై ఓ పాటను రాసి కంపోజ్ చేసి పాడాడు రాహుల్.

ఈయనకు డిజిటల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకటి రెండు కాదు.. ఈయన యూ ట్యూబ్ ఛానెల్ క ఏకంగా 5 లక్షలకు పైగా ఫాలోయర్స్ తో పాటు 10 కోట్ల వ్యూస్ ఉన్నాయి. అదే జగన్ పాటకు కూడా వచ్చాయి. దాంతో తన గెలుపుకు ప్రధాన కారణం వైఎస్ జగన్ కూడా అయ్యుంటాడని తనకు సన్నిహితులు చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు రాహుల్. ఆ పాట పుణ్యమా అని జగన్ ఫ్యాన్స్ అంతా తనకు ఓటేసుంటారని అనుకుంటున్నాడు రాహుల్. ఆయన అనుకోవడం కాదు కానీ నిజం కూడా ఇదే అంటున్నాయి నిఘా వర్గాలు. మొత్తానికి జగన్ అండతో బిగ్ బాస్ ఫైనల్ లో శ్రీముఖిని ఓడించాడు ఈయన.

More Related Stories