English   

మురుగుదాస్ పై మండిపడిన నయనతార..

nayan
2019-11-07 05:39:06

నయనతార అంటేనే ఫైర్ బ్రాండ్. ఈమె ఎప్పుడు ఎవరిపై ఎలా విమర్శలు గుప్పిస్తోందో ఎవరికీ తెలియదు. లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నయనతార.. ఇప్పుడు సంచలన దర్శకుడు మురుగదాస్ పై మండి పడింది. తన కెరీర్ పై ఎప్పటికీ చెరగని ఒక చేదు ముద్రను ఈ దర్శకుడు వేసాడు అంటూ మనసులో మాట బయట పెట్టింది నయనతార. ఇది ఇప్పుడు జరిగిన విషయం కాదు.. దాదాపు 14 సంవత్సరాల క్రితం నయనతార తన కెరీర్ కొత్తలో గజిని అనే సినిమాలో నటించింది. సూర్య హీరోగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే నయనతారకు గుర్తింపు తీసుకువచ్చిన సినిమా కూడా ఇదే. అయితే ఇందులో అసిన్ మొదటి హీరోయిన్ కాగా నయనతార రెండో హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఈమె పాత్ర చాలా గ్లామరస్ గా ఉంటుంది. అంతే కాకుండా అందాలు ఓ రేంజ్ లో ఆరబోసింది నయనతార. అప్పట్లోనే ఈ పాత్రను చూసి మహిళా సంఘాలు గోల పెట్టాయి. అవకాశాల కోసం మరి ఇంతగా దిగజారాలా అంటూ నయనతార పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు అప్పట్లో మహిళా సంఘాలు రచ్చ చేసాయి.

అదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుని నయనతార గజిని సినిమాలో తన పాత్రను మురుగదాస్ చెప్పినట్లుగా తీయలేదని.  కేవలం ఒక అందాల బొమ్మ గా వాడుకొని స్క్రీన్ పై అలా చూపించాడు అంటూ ఫైర్ అయ్యింది. తన జీవితంలో చేసిన ఏకైక తప్పు గజిని సినిమాలో నటించడం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నయనతార. అది మొదలు ఇప్పటివరకు దర్శకత్వంలో నటించలేదు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా మళ్లీ మురుగదాస్ తెరకెక్కిస్తున్న దర్బార్ సినిమాలో నటిస్తోంది నయనతార. ఈ సినిమాలో ఆమెకు ఇవ్వాల్సిన పారితోషికం సరిగా ఇవ్వలేదని.. అందుకే అది మనసులో పెట్టుకుని గజిని సినిమాను విమర్శించిందని.. అలాగే మురుగదాస్ తో ఒక ఆట ఆడుకుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తన రెమ్యూనరేషన్ ఇచ్చేంత వరకూ షూటింగ్ కి రాను అని నయనతార తెగేసి చెప్పడంతో మురుగదాస్ ఒక మెట్టు దిగి వచ్చి తీసుకు వచ్చాడని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఏదేమైనా కూడా సూర్య కెరీర్ ను మార్చిన ఒక బ్లాక్ బస్టర్ సినిమాను చెత్త సినిమా అనేసింది నయనతార.

More Related Stories